Telangana: ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తెలంగాణ భాష అంటారా?.. సీఎంపై పల్లా ఫైర్..
ABN, Publish Date - Feb 14 , 2024 | 02:52 PM
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అధికారమదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పైగా ఇది తెలంగాణ భాష అంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని ..
హైదరాబాద్, ఫిబ్రవరి 14: తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్షంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అధికారమదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పైగా ఇది తెలంగాణ భాష అంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అనుచిత భాషను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కడియం శ్రీహరి సీనియర్ ఎమ్మెల్యే అని, ఆయన ఎక్కడా బడ్జెట్‌కు సంబంధం లేని విషయాలు మాట్లాడలేదన్నారు.
సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్నాడని ఫైర్ అయ్యారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భాషను సీఎం అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయంపై ఎమ్మెల్యే పల్లా తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌లో కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
లోపించిన ప్రజాస్వామ్యం..
ప్రజాస్వామ్యం, ప్రజల పాలన అని ఊరదగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ ప్రజాస్వామ్యమే లేదన్నారు. రెండు నెల కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని పల్లా విమర్శించారు. అసెంబ్లీలో కంచెల పాలన తీసుకువచ్చారని, విపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
Updated Date - Feb 14 , 2024 | 02:53 PM