Hyderabad: 7న ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు
ABN, First Publish Date - 2024-01-03T13:24:14+05:30
ప్రతియేటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్(Andhra Jyoti-ABN) నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గులు.. పవర్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు,
నల్లకుంట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ప్రతియేటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్(Andhra Jyoti-ABN) నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్ ముత్యాల ముగ్గులు.. పవర్ బై ఎయిమ్స్ విద్యా సంస్థలు, బెంగళూరు.. రియల్ పార్ట్‌నర్ స్వర్గసీమ సుకేతన’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలు ఈనెల 7న ముషీరాబాద్ మెయిన్ రోడ్డు మెట్రోస్టేషన్ సమీపంలో గల ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు. చిక్కడపల్లి జోన్ పరిధిలోని ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాలకు చెందిన ఆసక్తి గల మహిళలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి రూ.4 వేలు, తృతీయ బహుమతికి రూ.3 వేలు ప్రదానం చేయనున్నారు. ఈ పోటీలో చుక్కల ముగ్గులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ముగ్గుల రంగులు మహిళలు వెంట తెచ్చుకోవాలి. ఈ పోటీలకు ఆసక్తి గల వారు 93930 04039, 99854 11018లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు.
Updated Date - 2024-01-03T13:24:16+05:30 IST