ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహకులకు సీపీ కీలక సూచనలు..

ABN, Publish Date - Apr 12 , 2024 | 11:06 AM

శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సీపీ.. నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మంగళ్‌హాట్‌లో అన్ని ప్రభుత్వ విభాగాల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు.

హైదరాబాద్: శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సీపీ.. నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మంగళ్‌హాట్‌లో అన్ని ప్రభుత్వ విభాగాల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ (GHMC), విద్యుత్ వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో శోభాయాత్ర నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. శ్రీరామనవమి శోభా యాత్ర ఈ నెల17వ తేదీన సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాత్రి 10 లోపు శోభాయాత్ర పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు.

Bhadrachalam: భద్రాచలంలో గోదావరి వరదకు అడ్డుకట్ట.. కొనసాగుతున్న మిగులు కరకట్ట నిర్మాణ పనులు


కళ్యాణం పది గంటల సమయానికి పూర్తి చేసి శోభాయాత్ర ప్రారంభం చేస్తే త్వరగా పూర్తి చేయవచ్చన్నారు. శోభాయాత్ర సందర్భంగా విగ్రహాల ఊరేగింపునకు పెద్ద టస్కర్ వాహనాలను వినియోగించవద్దని సీపీ సూచించారు. శోభాయాత్రలో పెద్దపెద్ద డీజే శబ్దాలు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రదర్శనలో ఇతర వర్గాలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డుకు ఇరువైపులా ప్రసాదాల వితరణ కేంద్రాలు వల్ల కూడా శోభాయాత్ర ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రసాదాల వితరణ కేంద్రాలు జిగ్జాగ్ ఏరియాలో పెట్టుకోవాలన్నారు. శోభాయాత్రకు ఇబ్బంది లేకుండా రోడ్డుకు ఇరువైపులా డయాస్‌లు వేసుకోవాలన్నారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

TS News: తెలంగాణలోని ఓ కుగ్రామం.. అస్సలు నమ్మశక్యం కాని దాని కథేంటో తెలిస్తే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 11:06 AM

Advertising
Advertising