National Child Award: 17 మందికి బాల పురస్కారాలు
ABN, Publish Date - Dec 27 , 2024 | 04:25 AM
వివిధ రంగాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి, అద్భుత విజయాలు సాధించిన 17 మంది చిన్నారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా గురువారం ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకున్నారు.
ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, డిసెంబరు 26: వివిధ రంగాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి, అద్భుత విజయాలు సాధించిన 17 మంది చిన్నారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా గురువారం ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకున్నారు. ‘వీర్ బాల్ దివస్’ సందర్భంగా.. కళలు, సంస్కృతి, దైర్యసాహసాలు, నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు, పర్యావరణం.. ఇలా ఏడు విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రపతి ఈ పురస్కారంతో సత్కరించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఏడుగురు బాలురు, 10 మంది బాలికలు అవార్డులతో పాటు పతకం, సర్టిఫికెట్, ప్రశంసాపత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు విజేతలను రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందించారు.
దేశ పురోగతిలో యువతదే కీలక పాత్ర: మోదీ
దేశ పురోగతిలో యువతదే కీలక పాత్ర అని.. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన నైపుణ్యం అందించి వారిని సిద్ధం చేసేందుకు భవిష్యత్ విధానం అవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘వీర్ బాల్ దివస్’ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. కాగా, పౌష్టికాహార సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ‘సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.
Updated Date - Dec 27 , 2024 | 04:25 AM