ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ

ABN, Publish Date - Jan 22 , 2024 | 03:36 PM

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరమయ్యాడు.

ఇంగ్లండ్‌(England)తో ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ గురించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) దూరమయ్యాడు. విరాట్ వ్యక్తిగత కారణాలతో దూరమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఈ మేరకు వెల్లడించింది. అయితే రెండు టెస్టుల నుంచి కోహ్లీ తప్పుకోవడానికి సరైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇంగ్లండ్‌తో ఈ టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి మొదలు కానుంది.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Smartphone Zombies: స్మార్ట్‌ఫోన్ జాంబీస్ సైన్ బోర్డుతో ప్రజలకు అలర్ట్..నెట్టింట వైరల్

అయితే దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యత అని విరాట్ చెప్పినట్లు తెలిసింది. కానీ కొన్నిసార్లు వ్యక్తిగత, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కోహ్లీ సెలవు తీసుకుంటున్నారని సమాచారం. అయితే విరాట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ నిర్ణయానికి టీమ్ మేనేజ్‌మెంట్ కూడా మద్దతు తెలిపిందని బీసీసీఐ(BCCI) తెలిపింది. ఇక మిగతా ఆటగాళ్లు మిగిలిన సిరీస్‌లకు అందుబాటులో ఉంటారని టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తారని బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Updated Date - Jan 22 , 2024 | 03:36 PM

Advertising
Advertising