Share News

Smartphone Zombies: స్మార్ట్‌ఫోన్ జాంబీస్ సైన్ బోర్డుతో ప్రజలకు అలర్ట్..నెట్టింట వైరల్

ABN , Publish Date - Jan 22 , 2024 | 03:13 PM

ఇటీవల బెంగళూరులో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొత్త రకం సైన్ బోర్డు అనేక మందిని ఆకర్షిస్తోంది. ఆ బోర్డులో స్మార్ట్‌ఫోన్ జాంబీస్ విషయంలో జాగ్రత్త అని రాసి ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఆ చిత్రం విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Smartphone Zombies: స్మార్ట్‌ఫోన్ జాంబీస్ సైన్ బోర్డుతో ప్రజలకు అలర్ట్..నెట్టింట వైరల్

ఇటీవల బెంగళూరు(bangalore)లో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొత్త రకం సైన్ బోర్డు అనేక మందిని ఆకర్షిస్తోంది. ఆ బోర్డులో స్మార్ట్‌ఫోన్ జాంబీస్(smartphone zombies) విషయంలో జాగ్రత్త అని రాసి ఉంది. అంతేకాదు దానిలో మొబైల్ ఫోన్లలో నిమగ్నమై వెళ్తున్నట్లు ఉన్న ఇద్దరి చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువగా అలవాటు పడిన జనం తమతమ పరిసరాలను సైతం విస్మరిస్తున్నారని అక్కడి నగరపాలక సంస్థ తెలిపింది. ఆ క్రమంలో వారు ఫోన్లను చూస్తూ రోడ్లపై సహా అనేక ప్రాంతాలకు వెళుతూ ప్రమాదాలను తెచ్చిపెడుతున్నారని ప్రజలకు సూచిస్తున్నారు.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: Ayodhya: రామాలయానికి ప్రతి ఏటా 5 కోట్ల మందికిపైగా టూరిస్టులు వచ్చే ఛాన్స్!

ఈ సైన్‌బోర్డ్ చిత్రాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఇప్పటి వరకు దానిని 3 లక్షల 75 వేల మందికిపైగా చూశారు. అంతేకాదు 7 వేల మందికిపైగా లైకులు కూడా చేశారు. అయితే దీనిని చూసిన పలువురు నెటిజన్లు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ వైరల్ అయినప్పటి నుంచి అతిగా స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది.

జనాలు రద్దీగా ఉండే రోడ్లపై కూడా కొంత మంది తమ ఫోన్‌లలో మాట్లాడుతూనే ఉన్నారని ఓ వ్యక్తి పేర్కొన్నారు. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్ కూడలి వద్ద వేచి ఉన్న సమయంలో కూడా కొంత మంది ఫోన్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. మరోవైపు ఇంకొంత మంది ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్లను దాటుతున్నారని తెలిపారు. అలాంటి క్రమంలో ప్రమదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఫోన్లను ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించడం ప్రమాదకరమని చెబుతున్నారు.

Updated Date - Jan 22 , 2024 | 03:13 PM