ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nitish Kumar Reddy: నితీష్‌కు భారీ ప్రైజ్‌మనీ.. ఒక్క ఇన్నింగ్స్‌తో జాక్‌పాట్ కొట్టేశాడు

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:47 PM

Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీతో దుమ్మురేపిన నితీష్ రెడ్డి పంట పండింది. అతడికి ఊహించని అదృష్టం వరించింది. తెలుగోడికి భారీ జాక్‌పాట్ తగిలింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Nitish Kumar Reddy

IND vs AUS: టీమిండియా యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో హాట్ టాపిక్‌గా మారిపోయాడీ తెలుగోడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో స్టన్నింగ్ సెంచరీతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు నితీష్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా లాంటి స్టార్లు విఫలమైన చోట మెరుపు సెంచరీతో అదరగొట్టాడు నితీష్. బౌండరీల మీద బౌండరీలతో కంగారూ బౌలర్లకు పోయించాడు. ఓటమి ఖాయం అనుకున్న టీమ్‌ను ఒడ్డున పడేశాడు. దీంతో అతడిపై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే టైమ్‌లో అతడికి గట్టి జాక్‌పాట్ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఎంత ఇచ్చారంటే..

బాక్సింగ్ డే టెస్ట్‌లో సెంచరీతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన నితీష్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. అతడికి రూ.25 లక్షల నగదు బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించింది. నేటి యువతకు నితీష్ రోల్ మోడల్ అని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మెచ్చుకున్నారు. అతడు తెలుగు వారికి గర్వకారణమన్నారు. శివనాథ్‌తో పాటు నితీష్ ప్రతిభను ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌ బాబు, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు అభినందించారు. కాగా, స్టన్నింగ్ నాక్ ఆడిన నితీష్ రెడ్డి మీద భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్ కే ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. మెల్‌బోర్న్ వంటి వేదికలో దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని సెంచరీ సాధించడం ఊహించలేనిదని అన్నారు.


అప్పుడే గుర్తించాం

ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్‌లా నితీష్ ఆడాడని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. 7 వికెట్లు పడిపోయి భారత్ కష్టకాలంలో ఉన్న టైమ్‌లో 8వ వికెట్‌గా వచ్చి సెంచరీ సాధించడం గొప్ప విషయమని చెప్పారు. 12, 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అతడిలోని టాలెంట్‌ను గుర్తించామన్నారు ఎమ్మెస్కే. ఆంధ్ర అకాడమీలో కోచ్‌లు, ట్రైనర్లు నితీష్‌ను మంచి క్రికెటర్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, యావత్ భారతదేశం నితీష్ సెంచరీ సాధించడం మీద హర్షం వ్యక్తం చేస్తోందన్నారు ఎమ్మెస్కే ప్రసాద్. నితిష్‌‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Also Read:

నితీష్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు.. గర్వపడేలా

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన నితీష్ రెడ్డి తల్లి.. కొడుకు బ్యాటింగ్

అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. పుష్ప స్టైల్లో సంబరాలు

For More Sports And Telugu News

Updated Date - Dec 28 , 2024 | 05:29 PM