ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: విద్యార్థితో ఫేషియల్ చేయించుకున్న హెచ్ఎం.. ఇదేంటన్నవారిపై దాడి

ABN, Publish Date - Apr 18 , 2024 | 09:33 PM

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కొందరు గురువులు దారి తప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తాగేసి బడికి వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ(Uttarpradesh) ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

లక్నో: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన కొందరు గురువులు దారి తప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తాగేసి బడికి వచ్చిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ(Uttarpradesh) ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఇక్కడ హెడ్ మాస్టర్(Headmaster) తప్పు చేయడం గమనార్హం. సాధారణంగా హెడ్‌మాస్టర్‌కు సవా లక్ష పనులుంటాయి.

BJP: ప్రవాసీయుల మద్దతు కోసం బీజేపీ వినూత్న ప్రచారం.. 'NRI4NAMO' కార్యక్రమం ప్రారంభం

స్కూల్ వ్యవహారాలు చక్కబెట్టడం, విద్యార్థులకు ఏ చిన్న లోటు రాకుండా చూసుకోవడం, ఉపాధ్యాయులను కో ఆర్డినేషన్ చేయడం.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. ఉన్నావ్ జిల్లా బిఘపూర్ బ్లాక్‌లోని దండమౌ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్‌ మాత్రం అందగా రెడీ అవ్వడమే పనిగా పెట్టుకున్నట్టుంది. ఇందుకోసం స్కూల్‌నే బ్యూటీ స్పాట్‌గా మార్చుకుంది.


విద్యార్థులను బ్యూటీషియన్లుగా మార్చుకుంది. బుధవారం ఓ విద్యార్థినితో స్కూల్‌లో కూర్చుని మేకప్ వేయించుకుంటుండగా.. సహాయక ఉపాధ్యాయుడు అనమ్ ఖాన్ విషయం తెలుసుకున్నాడు. విద్యార్థితో మేకప్ వేయించుకుంటున్న ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి తన ఫోన్‌లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకున్నారు.

అనంతరం మేకప్ వేయించుకుంటున్న గది తలుపు తీసి.. వేగంగా వెళ్లి హెడ్ మాస్టర్ ముఖాన్ని వీడియో తీశాడు. దీన్ని గమనించిన సంగీతా సింగ్ హుటాహుటిన పైకి లేచి.. ఫోన్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఫోన్ ఎంతకూ ఇవ్వకపోవడంతో సంగీతా.. అనమ్ ఖాన్‌ని విపరీతంగా కొట్టింది. ఫోన్ లాక్కునే క్రమంలో అనమ్ ఖాన్ చేతిని కొరికింది.

దీంతో ఆయన తీవ్ర రక్తస్రావం అయింది. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. డీఈవో సంగీతా సింగ్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. అనమ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తోటి ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు సంగీతా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన హెచ్ఎం విద్యార్థులతో సపర్యలు చేయించుకోవడం ఏంటని.. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎంను విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 09:39 PM

Advertising
Advertising