Share News

Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:40 PM

మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్‌కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.

Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్‌కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు. ఆయనే మొహ్లా-మన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్‌. ఆయన్ను 'ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌' అని కూడా పిలుస్తుంటారు. లక్ష్మణ్ కేవత్ ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో 2007లో కానిస్టేబుల్‌గా విధుల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2012లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా బీజాపూర్‌లో తొలిసారిగా పనిచేశారు. పదేళ్లుగా లక్ష్మణ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు రోడ్లు, విద్యుత్, వైద్యం, మందులు, విద్య సరిగ్గా అందవు. ఆయా ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని లక్ష్ణణ్ చెప్పారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేస్తారని, కాబట్టి ఆయా ప్రాంతాల్లో భద్రత చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.


Trending: ప్రపంచ వారసత్వ దినోత్సవం అంటే ఏమిటి.. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులను అంతమొందించాను. అప్పటి నుంచి మావోయిస్టులు నన్ను టార్గెట్ చేశారు. ఈ విషయం సీనియర్ అధికారులకు తెలియడంతో నా భద్రత దృష్ట్యా నన్ను అక్కడి నుండి బదిలీ చేశారు. నేను బీజాపూర్‌లో 2016 నుంచి 2018 వరకు విధులు నిర్వహించాను. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 10 ఏళ్లుగా ఉంటూ 100కి పైగా ఎన్‌కౌంటర్లలో పాల్గొనడం నాకు చాలా గర్వాన్ని కలిగించే విషయం. ఇంతమంది మరణించినా నా టీమ్‌లోని ఒక్క పోలీసు కూడా ఏ ఎన్‌కౌంటర్‌లోనూ మరణించలేదు. వారికి కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి. వారి ధైర్యాన్ని చూసి నేను ప్రేరణ పొందాను.

- లక్ష్ణణ్ కేవత్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్


Elections 2024: నామినేషన్ల పర్వంలో పోలీసుల అత్యుత్సాహం.. మీడియాకూ నో ఎంట్రీ..

పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్ కౌంటర్లు చేస్తామని లక్ష్ణణ్ తెలిపారు. హెలికాప్టర్‌ను సైతం ఎక్కడ ల్యాండ్ చేయాలో కూడా ముందే చూసుకుంటామన్నారు. దట్టమైన అడవిలో రాత్రి సమయంలో బస చేయాల్సి వస్తే అందుబాటులో ఉన్న ఆహారపదార్థాలు, వైద్య సదుపాయాలపై ముందుగానే ఓ అంచనాకు వస్తామని వెల్లడించారు. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను పణంగా పెట్టి నదులు, వాగులు దాటుకుంటూ ఆపరేషన్ నిర్వహించాలని చెప్పారు. వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని, మావోయిస్టులు నీటి కోసం వచ్చే సమయంలో మాటు వేసి అవసరమైతే వారిపై దాడులు చేస్తామని వివరించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 01:43 PM