ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: విమానంలో ఆకతాయి నీచపు పని.. ఎయిర్‌హోస్టెస్‌కు తెలీకుండా వెనుక నుంచి..

ABN, Publish Date - Jan 21 , 2024 | 09:22 PM

కొందరు మనిషి రూపంలో ఉన్నా.. పశువుల్లా ప్రవర్తిస్తుంటారు. మహిళ కనపడితే చాలు.. చిన్నా .. పెద్దా.. వయసు.. వరుస మరచి ప్రవర్తిస్తుంటారు. ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టడమో, లేక తాకరాని చోట తాకుతూ శునకానందం పొందడమో చేస్తుంటారు. ఈ క్రమంలో..

కొందరు మనిషి రూపంలో ఉన్నా.. పశువుల్లా ప్రవర్తిస్తుంటారు. మహిళ కనపడితే చాలు.. చిన్నా .. పెద్దా.. వయసు.. వరుస మరచి ప్రవర్తిస్తుంటారు. ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టడమో, లేక తాకరాని చోట తాకుతూ శునకానందం పొందడమో చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది మహిళలు.. బయటికి చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. అయితే కొన్నిసార్లు ఇలాంటి వారికి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పడం చూస్తుంటాం. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి విమానంలో నీచపు పని చేశాడు. ఎయిర్‌హోస్టెస్‌కు తెలీకుండా ఆమె వెనుక నుంచి వీడియో తీశాడు. చివరకు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విమానం ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఫుడ్ ట్రేతో వచ్చిన ఎయిర్‌హోస్టెస్‌ (Airhostess) ప్రయాణికులకు వడ్డిస్తోంది. అయితే ఈ క్రమంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌ అందరికీ ఫుడ్ అందిస్తూ వెనక్కు నడుస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె వెనుక ఉన్న ఓ ప్రయాణికుడు మొబైల్ బయటికి తీసి, చేత్తో కిందికి పట్టుకుని ఎయిర్‌హోస్టెస్‌‌ను వీడియో (Video recording) తీసేందుకు ప్రయత్నించాడు.

Optical illusion: ఇక్కడున్న వందలాది రొట్టెల మధ్య పిల్లి దాక్కుని ఉంది.. 7 సెకన్లలో కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

ఆమె సమీపానికి వచ్చే వరకూ వీడియో తీస్తూనే ఉన్నాడు. అతడి నిర్వాకాన్ని గమనిస్తున్న విమాన సిబ్బంది.. సడన్‌గా అతడి వద్దకు వెళ్లి ఫోన్ లాక్కున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’ .. అంటూ కొందరు, ‘‘వీడిని ఇంకోసారి విమానం ఎక్కకుండా చేయాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది సిగ్గుమాలిన చర్య’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మీకు వడ అంటే ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో..

Updated Date - Jan 21 , 2024 | 09:22 PM

Advertising
Advertising