Share News

Viral Video: మీకు వడ అంటే ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో..

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:23 PM

వడ అంటే ఇష్టపడని భోజన ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. వడ తయారీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. అందరికీ తెలిసిన ఆహార పదార్థమే అయినా.. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో..

Viral Video: మీకు వడ అంటే ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో..

వడ అంటే ఇష్టపడని భోజన ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. వడ తయారీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. అందరికీ తెలిసిన ఆహార పదార్థమే అయినా.. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో తయారయ్యే ఆహార పదార్థాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే ఉత్తర భారతదేశంలో అమృతసరి వడకు అంత పేరు ఉంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వడలు చేసే క్రమంలో వంట వాళ్ల నిర్వాకం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పని వాల్లు అమృతసరి వడ (amritsari vadi) తయారీకి సిద్ధమవుతారు. అయితే పిండి కలపడం దగ్గర నుంచి వడల తయారీ వరకూ ఎక్కడా శుభ్రత (Unhygienic Vada preparation) పాటించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వారంతా కలిసి చేతులకు గ్లౌజులు వేసుకోకుండానే పిండిన కలిపేస్తారు. మరో వైపు కాళ్లతో తొక్కుతూ అపరిశుభ్రం చేస్తుంటారు.

Viral: ఇంట్లోని పూజ గదిలో ఒంటరిగా ప్రసవించిన గర్భిణి.. ఆ వెంటనే ఆమె చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

ఇలా మిషన్ నుంచి తీసిన పిండిని ముద్దలు ముద్దలుగా చేసి ఎండలో ఆరబెడతారు. తర్వాత వాటిన్నంటినీ పెద్ద మైక్రోవోవెన్‌లో హీట్ చేస్తారు. ఇలా వడల తయారీలో వారు ఎక్కడా శుభ్రత పాటించకపోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఇక మీద వడలు తినాలంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇదేంటీ మరీ ఇంత దారుణంగా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు ఇసుకలో పిల్లల ఆటల్లా ఉన్నా.. చూస్తుండగానే వేడి వేడి కాఫీ ఎలా చేశాడో చూడండి..

Updated Date - Jan 21 , 2024 | 04:23 PM