Share News

Viral Video: హోటల్ గదిలో చప్పుడు రావడంతో చూసేందుకు వెళ్లారు.. తీరా కిటికీలో నుంచి తొంగిచూడగా..

ABN , Publish Date - Jan 20 , 2024 | 09:49 PM

సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాందోళన కలిగిస్తుంటాయి. ఊహించని విధంగా...

Viral Video: హోటల్ గదిలో చప్పుడు రావడంతో చూసేందుకు వెళ్లారు.. తీరా కిటికీలో నుంచి తొంగిచూడగా..

సోషల్ మీడియాలో నిత్యం వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాందోళన కలిగిస్తుంటాయి. ఊహించని విధంగా చోటు చేసుకునే అనూహ్య ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ హోటల్ గదిలో నుంచి చప్పుడు రావడంతో అంతా కంగారుగా వెళ్లారు. తీరా కిటీకీ నుంచి చూడగా లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జైపూర్‌లో (Jaipur) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కనోటా ప్రాంతంలోని ఓ హోటల్లో కొందరు ఓ గదిని (Hotel room) బుక్ చేసుకున్నారు. అయితే వారు గదిలోకి వెళ్లక ముందే లోపలి నుంచి శబ్దాలు వినిపించసాగాయి. దీంతో హోటల్ సిబ్బందితో పాటూ అక్కడే ఉన్న వారికి అనుమానం కలిగింది. లోపల ఏముందో అని కంగారుగా వెళ్లి కిటికీ నుంచి చూశారు. అయితే గది లోపలి నుంచి పులి (tiger) గాండ్రించడం చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ 10 జంతువులను పెంచుకుంటున్నారా.. అయితే మీరు జైలుకే..

కిటీకి వద్ద ఉన్న వారిని చూసి పులి కూడా దాడి చేసేందుకు పరుగు పరుగు సమీపానికి వచ్చింది. హోటల్లోకి పులి వచ్చిందని తెలియగానే అంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా హమ్మయ్య! .. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘వామ్మో! గదిలో మనుషులు ఉంటే పరిస్థితి ఏంటో’’.. అంటూ కొందరు, ‘‘అడవులు నరికేయడమే ఇందుకు కారణం’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూసేందుకు ఇసుకలో పిల్లల ఆటల్లా ఉన్నా.. చూస్తుండగానే వేడి వేడి కాఫీ ఎలా చేశాడో చూడండి..

Updated Date - Jan 20 , 2024 | 09:51 PM