ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఆపరేషన్ సందర్భంగా పాట ప్లే చేసిన డాక్టర్ .. ఎందుకో తెలిస్తే..

ABN, Publish Date - Apr 11 , 2024 | 04:16 PM

శస్త్రచికిత్స చేయించుకునేందుకు భయపడుతున్న ఓ చిన్నారి దృష్టి మరల్చేందుకు ఓ డాక్టర్ పాటించిన చిన్న ట్రిక్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: శస్త్రచికిత్స చేయించుకునేందుకు భయపడుతున్న ఓ చిన్నారి దృష్టి మరల్చేందుకు ఓ డాక్టర్ పాటించిన చిన్న ట్రిక్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో (Viral) ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో చూసి జనాలు డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే,

Viral: అప్పుడే పుట్టిన మనవడిని చూడగానే అత్తకు డౌట్.. కోడలికి బలవంతంగా డీఎన్‌ఏ టెస్టు చేయిస్తే..


మొగా జిల్లా భాగాపూరానా టౌన్‌కు చెందిన ఓ మూడేళ్ల బాలుడు కారు యాక్సిడెంట్‌లో గాయపడ్డాడు. అతడి కాలికి ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు నిర్ణయించారు. చిన్నారికి ఆపరేషన్ చేసేందుకు వచ్చిన డా.దివ్యాన్షూ గుప్తా బిడ్డ కంగారు పడటాన్ని గుర్తించారు. నొప్పి తెలీకుండా ఎనస్థీషియా ఇచ్చినా బాలుడు మాత్రం ఆపరేషన్‌కు సహకరించలేదు. దీంతో, చిన్నారి దృష్టి మరల్చి ఆపరేషన్ చకచకా చేసేందుకు డిసైడైన ఆయన చిన్నారిని మెల్లగా మాటల్లోకి దింపారు. అతడికి ఇష్టమైన పాటలు, విషయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే తనకు సిద్దూమూసేవాలా పాటలు చాలా ఇష్టమని బాలుడు ఉత్సాహంగా చెప్పాడు. దీంతో, డాక్టర్ తన మొబైల్ ఫోన్‌లో ఆ ర్యాపర్ పాట ప్లే చేసి 25 నిమిషాల్లో ఆపరేషన్ ముగించారు.

Viral: చిరుతకే షాకిచ్చిన రైతు.. బిత్తరపోయిన క్రూర మృగం.. వైరల్ వీడియో


‘‘పాట వింటున్నప్పుడు చిన్నారిలో కంగారు తగ్గింది. అతడు లయబద్ధంగా చేతులు ఊపుతూ పాటలో లీనమైపోయాడు. మరోవైపు, అతడి దృష్టి మళ్లీ ఆపరేషన్‌వైపు రాకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ఒకరు అతడితో కలిసి పాట పాడాడాడు. ఈలోపు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాం’’ అని వైద్యులు చెప్పారు. చిన్నారి కోలుకుంటున్నాడని మరో నెలరోజుల్లో నడుస్తాడని తెలిపారు. దీంతో, ఆ డాక్టర్‌పై ప్రశంసలు కురుస్తాయి.

Viral: గుండెలో దిగబడ్డ ఇనుపరాడ్డు.. అరుదైన సర్జరీతో రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2024 | 04:51 PM

Advertising
Advertising