ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం చూస్తే..

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:15 PM

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి బయటికి వెళ్లాల్సిన సమయంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. ఇలాంటి...

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి బయటికి వెళ్లాల్సిన సమయంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ లారీ డ్రైవర్ చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఇతను ఏం చేశాడంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ డ్రైవర్ (Lorry driver) మధ్యాహ్న సమయంలో లారీ నడుపుతున్నాడు. ఎండ వేడికి లారీ క్యాబిన్‌లో అతడికి తీవ్ర ఉక్కబోతగా మారింది. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు విచిత్రంగా ఆలోచించాడు. ఏకంగా ఓ పెద్ద బకెట్‌తో నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకున్నాడు. లారీ నడుపుతూనే బకెట్ నుంచి నీళ్లు (Shower in the lorry cabin) తీసుకుంటూ తలపై పోసుకున్నాడు. ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ.. మరో చేత్తో బకెట్‌తో నీళ్లు పోసుకుంటున్నాడు. మధ్యలో స్నానం చేసే సమయంలో ఒళ్లు రుద్దుకున్నట్లుగానే నటిస్తున్నాడు.

Viral Video: అయ్యో.. ఎంత ఘోరం..! శ్మశానవాటిక పక్కనే కూర్చుని ఉండగా.. ఉన్నట్టుండి..

అలాగే మధ్య మధ్యలో స్టీరింగ్ పూర్తిగా వదిలేసి స్నానం చేయడం మొదలెట్టాడు. ఇలా అతను చాలా దూరం వరకూ స్నానం చేస్తూనే వెళ్లాడు. ఈ ఘటనను మొత్తం లారీలోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతనేంటీ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం ప్రమాదకరం.. ఇతన్ని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇతను చేసే వెకిలిపనుల వల్ల ఇతురులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో..! ఈ కింగ్ కోబ్రా ఎంత పని చేసిందీ.. దాని నోటి నుంచి ఏం బయటికి వచ్చిందో చూస్తే..

Updated Date - Apr 25 , 2024 | 04:16 PM

Advertising
Advertising