ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: తమ్మినేనికి గడ్డుకాలం.. ఎక్కడ చూసినా ఇదే సీన్.!?

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:58 PM

AP Elections 2024: స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్‌ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్‌ కారణంగా..

స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్‌ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్‌ కారణంగా 2019 ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తమ్మినేని గెలుపొందారు. అనూహ్యంగా స్పీకర్‌ పదవి పొందారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయనే వైసీపీ తరపున బరిలో దిగనున్నారు. కాగా.. ఈసారి మాత్రం ఆయనకు సొంత పార్టీ నుంచే అసంతృప్తి సెగలు, వర్గపోరు కారణంగా ఎదురీత ఈదాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడాలేనంతగా ఈ నియోజకవర్గంలో వైసీపీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాలే కాదు.. కొన్ని నెలల కిందట ముఖ్య మంత్రి జగన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను సైతం వేర్వేరుగా జరుపుకొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ్మినేని పేరు ఖరారు కాగానే.. గంటల వ్యవధిలో ఆమదాలవలస నియోజకవర్గంలో రాజీనామాల పర్వం జోరందుకుంది.

AP Elections: ఓరి బాబోయ్.. వైఎస్ జగన్ రెడ్డి కడపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే..!


అసలేం జరిగింది..?

రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శిగా సువ్వారి గాంధీ మొన్నటివరకు కొనసాగారు. ఓ పదవి విషయంలో గాంధీని తమ్మినేని సీతారాం పక్కనబెట్టారు. దీంతో వారి మధ్య వర్గ విభేదాలు పెరిగాయి. వైసీపీలోనే ఉంటూ నేరుగా తమ్మి నేని ఎదురిస్తూ గాంధీ తిరుగుబావుటా ఎగురవేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ్మి నేనికి టికెట్‌ ఇవ్వకూడదని.. వెంటున్న వారికి న్యాయం చేయడం లేదని అధిష్ఠా నానికి గాంధీ తెలిపారు. గాంధీ సతీమణి దివ్య పొందూరు మాజీ ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. తన బంధువైన సువ్వారి సువర్ణకు.. తమ్మినేనితో సంబంధం లేకుండానే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవిని అధిష్టానం కట్ట బెట్టింది. ఈ అవకాశాన్ని పాజిటివ్‌గా మలుచుకుని.. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బుక్‌ డిపో సెంటర్లను తెరిపించారు.

అయ్యో.. అధ్యక్షా!

యువతకు చిన్నపాటి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో ఇటీవల వర్గపోరును పక్కనబెట్టి వైసీపీ అధిష్ఠానం తమ్మినేనికే టికెట్‌ ఇచ్చింది. దీంతో అధిష్ఠానం తీరును వ్యతిరేకిస్తూ గాంధీ, తన సతీమణి దివ్య, తన బంధువు సువర్ణ.. ఇటు పార్టీ పదవులకు, అటు నామినేటెడ్‌ పదవులకు సైతం రాజీనామా చేసేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలో దిగి తమ్మినేనిని ఢీకొడతానని.. ఓడించి తీరు తానని ప్రచారం చేస్తున్నారు. తమ్మినేని అనుచరులు కూడా మద్దతుగా పాల్గొంటున్నారు. అలాగే వైసీపీ నాయకులు చింతాడ రవికుమార్‌, కోట గోవిందరావు సైతం తమ్మినేనికి వర్గానికి దూరంగా ఉంటూ సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో సుమారు 20వేల ఓట్ల చీలిక జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో సీతారామ్‌కు గడ్డుపరిస్థితి ఎదురుకాగా.. టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 01:12 PM

Advertising
Advertising