పాలను ఏ సమయంలో తీసుకోవాలి.. !
ABN, Publish Date - Dec 22 , 2024 | 07:43 AM
రోజూ పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ వంటి అవసరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. పాలను ఏ సమయంలో తీసుకోవాలో తెలుసుకుందాం.
పాలలోని పోషకాలతో శక్తి, ఎముకల బలాన్ని పెంచుతాయి.
పాలలో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, డి, ఫాస్పరస్ ఉంటాయి.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి పాలకు మంచి గుణాలున్నాయి.
రోజూ పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోజులో 2 నుంచి 3 కప్పుల పాలను తీసుకోవాలి.
పాలను భోజనం తర్వాత తీసుకోవడం వల్ల కేలరూలు తగ్గుతాయి. బరువుతగ్గడానికి సహకరిస్తుంది.
వ్యాయామం చేసిన తర్వాత పాలను తాగడం వల్ల కండరాలు అభివృద్ధి చెంది. శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది.
Updated Date - Dec 22 , 2024 | 07:44 AM