కవితకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం..
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:20 PM
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
శంషాబాద్ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు అభివాదం తెలుపుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా ఇంటికి తరలి వెళుతున్న దృశ్యం..
హైదరాబాద్‌లోని తన నివాసంలో తల్లిని గుండెలకు హద్దుకుని భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో సోదరుడు కేటీఆర్‌ను పట్టుకుని భావోద్వేగానికి గురైన దృశ్యం..
తన కోసం వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న కవిత.
తన నివాసంలో సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కడుతున్న కల్వకుంట్ల కవిత...
'సత్యమేవ జయతే' అంటూ బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి మహిళా కార్యకర్తలు ఫ్లాకార్డులతో కల్వకుంట్ల కవితకు స్వాగతం పలుకుతున్న దృశ్యం..
Updated Date - Aug 29 , 2024 | 12:20 PM