Shobhayatra: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర..
ABN, Publish Date - Sep 17 , 2024 | 11:09 AM
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు భారీ ట్రక్కును తెప్పించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని ట్రక్కులోకి ఎక్కించారు. మంగళవారం ఉదయం 6:15 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకు పెద్దఎత్తున సాగనుంది. వందల, వేల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే ఖైరతాబాద్‌కు చేరుకున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గణేశుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి ప్రారంభించారు.
వైభవంగా కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు..
కన్నుల పండువగా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి..
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో భక్తజనసందోహం..
మహాగణపతి శోభాయాత్రలో నృత్యాలు చేస్తున్న మహిళలు..
కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..
Updated Date - Sep 17 , 2024 | 11:09 AM