హైదరాబాద్‌లో బారీ వర్షం దృశ్యాలు..
ABN, Publish Date - Jun 18 , 2024 | 09:13 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్లూ పడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల కూకటివేళ్లతో చెట్లు కూలిపోయాయి. అమీర్ పేట, టోలిచౌకి-గోల్కొండ ఎండీ లైన్స్‌లో 200 ఏళ్లనాటి భారీ వృక్షం కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు మధురానగర్ డీ-70 బ్లాక్‌లో భారీవృక్షం నేలకూలింది. ఈ ఘటనలో ఓ కారు ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో సోమవారం కురిసిన భారీ వర్షానికి టోలిచౌకిలో కూలిన 200 ఏళ్ల నాటి వృక్షం..
దేవరకొండ బస్తీలో ఇళ్లల్లోకి వస్తున్న వరద నీరు..
అమీర్ పేటలోని జలమయమైన సత్యం టీకీస్ రోడ్..
భారీ వర్షానికి ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీలో కారుపై విరిగిపడ్డ చెట్టు..
బండారు బాల్‌రెడ్డినగర్‌లో వరద ఉధృతి...
భారీ వర్షానికి మధురానగర్ డి-బ్లాక్‌లో రహదారికి అడ్డంగా కారుపై నేలకొరిగిన భారీ వృక్షం..
Updated Date - Jun 18 , 2024 | 09:13 AM