Tirumala: శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి కుటుంబం
ABN, Publish Date - Aug 22 , 2024 | 12:41 PM
తిరుపతి: తిరుమల శ్రీవారిని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం తన పుట్టిన రోజు కావడంతో తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి బుధవారం తిరుమలకు వచ్చారు. గురువారం తెల్లవారుజామున స్వామివారి సుప్రభాతసేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు చిరంజీవికి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దగ్గరుండి చిరంజీవికి శ్రీవారి దర్శనం చేయించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని కుటుంబసభ్యులతో కలిసి బయటకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి..
దగ్గరుండి చిరంజీవి కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శనం చేయించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి..
తిరుమల ధ్వజస్తంభాన్ని తాకి మొక్కులు తీర్చుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి..
తిరుమలకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి పరామర్శించి ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం..
శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన మెగాస్టార్‌ను పరామర్శిస్తున్న అభిమానులకు నమస్కరిస్తున్న చిరంజీవి..
తిరుమల శ్రీవారి సుప్రభాతసేవలో కుటుంబసభ్యులతో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి..
శ్రీవారి దర్శనానికి వెళుతూ.. అభిమానులకు అభివాదం తెలుపుతున్న చిరంజీవి.. వెనుక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని చూడవచ్చు..
తిరుమల క్యూ లైన్లో ఉన్న ఓ అభిమానికి షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతున్న మెగాస్టార్...
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి..
Updated Date - Aug 22 , 2024 | 12:41 PM