ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena: పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం దృశ్యాలు..

ABN, Publish Date - Apr 01 , 2024 | 11:20 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. ఇక్కడ పవన్ విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే బూత్ లెవెల్లో కూటమి నేతలు కలిసి ఏ విధంగా పని చేయాలి.. వైసీపీ చేస్తున్న కుట్రలు, కుయుక్తులు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలన్న దానిపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు ఆయన అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికా దేవి అమ్మవారిని పవన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత దత్తాత్రేయ పీఠాన్ని దర్శించుకున్నారు.

1/7

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు.

2/7

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం పిఠాపురంలో రోడ్ షో నిర్వహిస్తున్న దృశ్యం..

3/7

పిఠాపురంలో రోడ్ షో నిర్వహిస్తుండగా మేడలపై నుంచి చూస్తున్న మహిళలకు పవన్ కల్యాణ్ నమస్కరిస్తున్న దృశ్యం.

4/7

అత్యంత ప్రాచుర్యం పొందిన పురుహూతికా దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పవన్ కల్యాణ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న దృశ్యం.

5/7

పురుహూతికా దేవి అమ్మవారి చిత్రపటాన్ని పవన్ కల్యాణ్‌కు బహూకరిస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు..

6/7

పిఠాపురంలో దత్తాత్రేయ పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

7/7

దత్తాత్రేయ పీఠాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణకు ఆలయ అర్చకులు నుదుట తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్న దృశ్యం.

Updated Date - Apr 01 , 2024 | 11:20 AM

Advertising
Advertising