పరునాష్టం కేసులో కోర్టుకు వచ్చిన నారా లోకేష్..
ABN, Publish Date - Oct 18 , 2024 | 12:56 PM
విశాఖపట్నం: సాక్షిపై వేసిన పరునాష్టం దావా కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం విశాఖ కోర్టుకు వచ్చారు. గురువారమే నగరానికి చేరుకున్న ఆయన రాత్రి పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిపత్రికలో అసత్యాలు, కల్పితాలతో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
మంత్రి లోకేష్ గురువారం రాత్రి విశాఖకు వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్టులో ఆయనను శాలువతో సన్మానించి..స్వాగతం పలికిన టీడీపీ నేతలు..
విశాఖ విమానాశ్రయం నుంచి టీడీపీ నేతలు, సెక్యూరిటీతో బయటకు వస్తున్న మంత్రి నారా లోకేష్..
పరునాష్టం దావా కేసులో విశాఖ కోర్టుకు వచ్చిన మంత్రి లోకేష్..
విశాఖ కోర్టు వద్ద మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ తదితరులు..
సాక్షిపై వేసిన పరునాష్టం దావా కేసులో కోర్టు వద్ద న్యాయవాదులతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్.. పక్కన ఎంపీ భరత్..
Updated Date - Oct 18 , 2024 | 12:56 PM