కర్నూలులో భారీ వర్షం.. లోతట్టు కాలనీలు జలమయం
ABN, Publish Date - Jun 10 , 2024 | 10:25 AM
కర్నూలు: వరుసగా కురుస్తున్న వర్షానికి కర్నూలు, కల్లూరు నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. అశోక్‌నగర్, డీమార్టు ఏరియా, కొత్తబస్టాండుకు వెళ్లే కేసీ కెనాల్ బ్రిడ్జి కింద, కల్లూరులో బ్రిడ్జి ప్రాంతంతోపాటు లోతట్టు కాలనీల్లో నీటి నిల్వ చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెత్తా చెదారం కాలువల్లో పేరుకుపోవడంతో లోతట్టు కాలనీల్లోని మురు గునీరు బయటకు పోయే దారి లేక రోడ్లపై ఏరులై పారుతోంది.
కర్నూల్ నగరంలో కురిసిన వర్షం పలుచోట్ల రోడ్లపైనే నిలిచిన వర్షపు నీరు వాహన దారుల ఇక్కట్లు
కర్నూల్ నగరంలో ఆదివారం కురిసిన వర్షానికి చెరువులను తలపిస్తున్న రోడ్లు..
రోడ్లు జలమయం కావడంతో వాహనదారుల ఇక్కట్లు..
భారీ వర్షానికి చెత్తా చెదారం కాలువల్లో పేరుకుపోయిన దృశ్యం..
లోతట్టు కాలనీల్లోని మురుగు నీరు బయటకు పోయే దారి లేక రోడ్లపై ఏరులై పారుతున్న దృశ్యం.
Updated Date - Jun 10 , 2024 | 10:25 AM