ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: పామర్రు ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు..

ABN, Publish Date - Apr 08 , 2024 | 11:12 AM

ప్రజాగళం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు లేకుంటే కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే 2014లో తాము అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని.. అది పూర్తయ్యేలోపు డెల్టాకు సకాలంలో నీరివ్వాలనే ఆలోచనతో పట్టిసీమను కట్టామని తెలిపారు. కానీ ఓ దుర్మార్గుడు (జగన్) అధికారం చేజిక్కించుకుని పోలవరం ఆపేశాడని, కాల్వల్లో కన్నీరు పారిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారులపై గోతులను పూడ్చలేని వ్యక్తి రాష్ట్రంలో మూడు రాజధానుల కడతానని చెబుతున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

1/6

ప్రజాగళంలో భాగంగా కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం పర్యటనకు వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలకు విక్టరీ సంకేతం చూపుతున్న దృశ్యం.

2/6

పామర్రు నియోజకవర్గం పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు గజమాలతో సన్మానిస్తున్న దృశ్యం.

3/6

ప్రజాగళం యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తున్న దృశ్యం.

4/6

కృష్ణా జిల్లా, పామర్రులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోకు మండుటెండను లెక్కచేయకుండా తరలి వచ్చిన ప్రజానీకం..

5/6

ఏపీకి డ్రైవర్ బాబు అంటూ ‘రాతియుగం-స్వర్ణయుగం’ పేరుతో పామర్రులో చంద్రబాబు బస్సు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు..

6/6

‘పెద్ద కొడుకులా కష్టపడతాడు.. భరోసా బండిని నడిపిస్తాడంటూ’.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిక్షా తొక్కుతున్నట్లు ఫ్లెక్సీని పట్టుకున్న ఓ చిన్నారి.

Updated Date - Apr 08 , 2024 | 11:14 AM

Advertising
Advertising