ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramayana: ప్రపంచంలో ఖరీదైన రామాయణ పుస్తకం, ధర ఎంతంటే..?

ABN, Publish Date - Jan 20 , 2024 | 02:14 PM

శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. లేటెస్ట్ రామాయణ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఆ పుస్తకం ధర మాత్రం లక్ష 65 వేల రూపాయలు.

ఏబీఎన్ ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఎల్లుండి అట్టహాసంగా జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముడి జీవిత చరిత్రను వాల్మీకి ‘రామాయణం’లో రాశారు. రామాయణ గ్రంథాలు కొందరి వద్ద ఉన్నాయి. లేటెస్ట్ బుక్ అందుబాటులోకి వచ్చింది. ధర వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే పుస్తకం ఖరీదు అక్షరాల లక్ష 65 వేల రూపాయలు.

ఎందుకంత ప్రత్యేకత..?

రామాయణ పుస్తకానికి అంత ధర ఉండడానికి కారణం ఉంది. ఆ పుసక్తం రామ మందిరం మాదిరిగా మూడు అంతస్తుల ప్రతిబింబంలా ఉంది. దేవుని మందిరంలా కలపతో తయారు చేశారు. పుస్తక బరువు 45 కేజీలు ఉంది. రామాయణ గ్రంథాన్ని బయటకు తీసి చూపించారు విక్రేత మనోజ్. పుస్తకంలో పేజీలను ఫ్రాన్స్ నుంచి తెప్పించారు. అవి యాసిడ్ రహిత పేజీలు, చిరగవని వివరించారు. అలాంటి పేజీల మీద రాసేందుకు ఇంక్ జపాన్ నుంచి తీసుకొచ్చారు. రామాయణ పుస్తకం కవర్ పేజీని విదేశాల నుంచి తెప్పించారు.

400 ఏళ్లు చెక్కు చెదరదు

రామాయణ పుస్తకం కోసం వాడిన కలప అమెరికా వాల్ నట్, డిజైన్ కోసం కుంకుమ పువ్వును ఉపయోగించారు. ఈ పుస్తకం 400 ఏళ్ల పాటు చెక్కు చెదరదని మనోజ్ చెబుతున్నారు. ఒక్కరు కొనుగోలు చేస్తే నాలుగు తరాలు చదివే వీలు ఉంటుందని వివరించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన రామాయణం పుస్తకంతో అయోధ్యకు చేరుకున్నామని తెలిపారు. ఇది అందమైన రామాయణ పుస్తక ప్రతీ అంటున్నారు. ప్రతి పేజీలో డిఫరెంట్ డిజైన్ ఉంటుందని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 20 , 2024 | 02:14 PM

Advertising
Advertising