ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lucknow: యూపీలో నడిరోడ్డుపై దారుణం.. ఇదేనా మీ నారీ శక్తి అంటూ బీజేపీపై మండిపడ్డ టీఎంసీ

ABN, Publish Date - Apr 14 , 2024 | 07:05 PM

పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ యాత్రికురాలిని నడి రోడ్డుపై ఓ యువకుడు వేధించాడు. ఈ ఘటన తాలూకూ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై స్పందించింది.

లక్నో: పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ యాత్రికురాలిని నడి రోడ్డుపై ఓ యువకుడు వేధించాడు. ఈ ఘటన తాలూకూ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై స్పందించింది.

ఇదేనా మీ నారీ శక్తి మోదీజీ అంటూ మండిపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కి చెందిన ఓ యువతి తన కుటుంబ సభ్యులతో మధురకు వచ్చింది. అక్కడున్న ఆలయాలను సందర్శిస్తూ మరో ప్రాంతానికి వెళ్తుండగా ఓ యువకుడు వేధించాడు. చేతిలో బిడ్డ ఉన్నా ఆమె వెంట పడి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆమె అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.


ఆ తర్వాత అక్కడి నుంచి నిందుడుడు పారిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఈ సంఘటన అనంతరం ఆ మహిళ తన కుటుంబంతో కలిసి బెంగాల్‌కు వెళ్లిపోయింది. కాగా, ఈ విషయంపై గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు.

దీంతో తన తప్పుకు క్షమాపణలు కోరిన అతడు చెప్పుతో కొట్టుకున్నాడు. తప్పును అంగీకరించడంతో గ్రామ పెద్దలు అతడ్ని వదిలేశారు. అయితే ఈ ఘటనపై టీఎంసీ మండిపడింది. ప్రధాని మోదీ తరచూ చెప్పే నారీ శక్తి ఇదేనా అని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం సిగ్గు చేటని విమర్శించారు. పాలకులు నేరస్థులైతే.. ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 14 , 2024 | 07:06 PM

Advertising
Advertising