Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆరు రోజులు వర్ష సూచన
ABN, Publish Date - Dec 21 , 2024 | 10:42 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- ఐఎండి వెల్లడి
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావం కారణంగా చెన్నైలోని ప్యారీస్, అన్నా నగర్, సైదాపేట, మైలాపూర్, వడపళని, కోడంబాక్కం, నుంగంబాక్కం(Mylapore, Vadapalani, Kodambakkam, Nungambakkam), థౌజండ్‌లైట్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం వేకువజాము నుంచే తేలికపాటి వర్షం కురిసింది.
ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి
అలాగే, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, తిరువళ్లూరు, మైలాడుదురై, తిరువారూర్, తంజావూరు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ఈ నెల 25వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducherry) రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. జాలర్లు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొద్దని, సముద్ర తీరంలో గాలుల వేగం గంటలకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 21 , 2024 | 10:42 AM