Share News

Harish: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

ABN , Publish Date - Nov 29 , 2024 | 02:37 PM

Telangana: ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని.. కరీంనగర్ నుంచి దీక్ష కోసం కేసీఆర్ వస్తుంటే ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని హరీష్‌రావు అన్నారు. కేసీఆర్‌కు మద్దతుగా సిద్దిపేటలో దీక్ష శిబిరంలో దీక్ష చేస్తున్న తమపై గొర్రెల మందపై తోడేళ్ళు పడ్డట్టు పోలీసులు అరెస్టులు చేశారని మండిపడ్డారు.

Harish: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు
Former Minister Harish Rao

సిద్దిపేట, నవంబర్ 29: ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్‌ రావు (Former Minister Harish Rao) అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి, రంగాధంపల్లి అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారని.. పందికొక్కుల్లగా తిని మళ్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను కాపాడాలని ఆరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. ఇకపై అలాంటి వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు.

RGV: నేను పరారీలో లేను.. పోలీసుల విచారణపై వర్మ వితండవాదం


1956 లోనే ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి పెద్దలు వ్యతిరేకించారని తెలిపారు. నాటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్రియ ద్వారా స్వరాష్ట్ర సాదనకు కేసీఆర్ బయలుదేరారని తెలిపారు. కేంద్రంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణను చేర్చారని... షిప్పింగ్ శాఖ ఇస్తే, డీఎంకే వాళ్ళు అడిగితే ఇచ్చేశారని వెల్లడించారు. తెలంగాణ కోసం శాఖ లేని మంత్రిగా ఆరు నెలలు కేసీఆర్ పని చేశారని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ ఏం చేసిందో తెలిసిందే.. ఎన్నో పోరాటాలు, అవమానాలు ఎదురయ్యాయన్నారు.


గడ్డి పోచల్లాగా పదవులను తెలంగాణ కోసం త్యాగం చేశామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని దుయ్యబట్టారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు. ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని.. కరీంనగర్ నుంచి దీక్ష కోసం కేసీఆర్ వస్తుంటే ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారన్నారు. కేసీఆర్‌కు మద్దతుగా సిద్దిపేటలో దీక్ష శిబిరంలో దీక్ష చేస్తున్న తమపై గొర్రెల మందపై తోడేళ్ళు పడ్డట్టు పోలీసులు అరెస్టులు చేశారని మండిపడ్డారు. రాజకీయ ప్రక్రియ విఫలం కావడంతో గాంధీజీ అహింసా మార్గంలో నిరాహార దీక్ష చేపట్టారన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో రోజు రోజుకు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న దీక్ష విరమణకు నిరాకరించారన్నారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేదంటే కేసీఆర్ శవయాత్ర అంటూ కేసీఆర్ పట్టు పట్టారని చెప్పుకొచ్చారు.


డిసెంబర్ 9న ప్రొఫెసర్ జయశంకర్ స్వహస్తాలతో రాసిన తెలంగాణ ప్రక్రియ ప్రాబిస్తున్నట్లు రాసిన ప్రకటనను నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారని. డిసెంబర్ 9న ఇచ్చిన తెలంగాణ ను కేంద్రం డిసెంబర్ 23న వాపస్ తీసుకుందన్నారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వెన్ను చూపారని విమర్శించారు. సిద్దిపేటలో తెలంగాణ కోసం చేపట్టిన దీక్ష శిబిరం 1531 రోజులు నడిపామన్నారు. తెలంగాణ కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడన్నారు. తెలంగాణ సాధనలో ఒక కార్యకర్తగా పాల్గొన్న తృప్తి మరిదేనితో సమానం కాదన్నారు. ‘‘రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా ? ఉద్యమంలో ఒక్క కేసు ఉన్నదా..? ఒక్కనాడైనా అమరులకు పూలు వేషాడా ? ఈయన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. అలుగునూరులో కేసీఆర్‌ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్ళు తుడుస్తావా? లేక తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచి వేస్తావా? జై తెలంగాణ అన్న వారిపై తుపాకీతో వెళ్లిన మరక నీ జీవితంలో ఎన్నటికీ పోదు. రేవంత్ సర్కారువన్ని డబుల్ మాటలే. లగచర్లలో గిరిజనులు తిరగబడితే వెనక్కి తగ్గిండు. కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో మనం మళ్ళీ సంకల్పం తీసుకుందాం. ఈ ప్రజావ్యతిరేక సర్కారును గద్దె దించేవరకు రైతుల పక్షాన, యువకుల పక్షాన, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందాం’’ అంటూ హరీష్‌ రావు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

పంజా విసిరిన పులి.. ఏం జరిగిందంటే..

గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 02:37 PM