ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bomb Blast: రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు..!

ABN, Publish Date - Mar 13 , 2024 | 01:44 PM

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని కర్ణాటక ( Karnataka ) లోని బళ్లారి జిల్లాకు చెందిన షబ్బీర్‌గా గుర్తించారు.

బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుడిని కర్ణాటక ( Karnataka ) లోని బళ్లారి జిల్లాకు చెందిన షబ్బీర్‌గా గుర్తించారు. ఈ మేరకు నిందితుడి చిత్రాన్ని ఎన్‌ఐఏ గతంలోనే విడుదల చేసింది. అతని ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలిస్తుండగా తాజాగా గుర్తించినట్లు తెలుస్తోంది. మార్చి 1న రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. రెండు రోజుల తర్వాత నిందితుడిని గుర్తించారు.

ఈ కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే ₹ 10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఎన్ఐఏ విడుదల చేసిన చిత్రంలో అతను టోపీ, నల్ల ప్యాంటు, నల్ల బూట్లు ధరించాడు. పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. పేలుడుకు టైమర్‌తో కూడిన ఐఈడీ పరికరాన్ని ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 01:44 PM

Advertising
Advertising