ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sandeshkhali: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించండి.. ద్రౌపది ముర్మును కోరిన ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్

ABN, Publish Date - Mar 06 , 2024 | 11:14 AM

బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేశారు.

ఢిల్లీ: సందేశ్ ఖాళి (Sandeshkhali) హింసాత్మక ఘటనలతో పశ్చిమ బెంగాల్ (West Bengal) రగిలిపోతుంది. అల్లర్లకు కారణమైన టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి మారలేదు. పోలీసుల వద్ద షాజహాన్ స్వేచ్ఛగా ఉన్నారని విపక్షాలు మండి పడుతున్నాయి. సందేశ్ ఖాళి అల్లర్ల కేసును బెంగాల్ సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. కేసును సీఐడీ నుంచి సీబీఐ అధికారులకు అప్పగించాలని కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

బెంగాల్‌లో (West Bengal) ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సందేశ్ ఖాళి ఘటనతో నెలకొన్న ఆందోళనతో బెంగాల్‌లో రాష్ట్రపతిప పాలన విధించాలని కోరారు. అంతకుముందు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఇలాంటి ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత రేఖా శర్మ కూడా రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ‘సందేశ్ ఖాళి ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటింది. సందేశ్ ఖాళి ఘటనే కాదు ఇదివరకు చాలా ఘటనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేశాను అని’ రేఖా శర్మ తెలిపారు. బెంగాల్‌లో పరిస్థితిని నిశీతంగా పరిశీలిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము తమకు తెలియజేశారని రేఖా శర్మ వివరించారు.

భూ ఆక్రమణలు, మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలను టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రేషన్ స్కామ్‌కు సంబంధించి షాజహాన్ ఇంటికి ఈడీ అధికారులు రాగా అతని అనుచరులు దాడి చేశారు. దాంతో వివాదం చెలరేగింది. షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అధికారులు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చని కోల్ కతా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ వెంటనే కోల్ కతా పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 11:42 AM

Advertising
Advertising