ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: నేటితో ముగియనున్న గడువు.. ఆ ఒక్క రాష్ట్రంలో మాత్రం రేపటి వరకు..

ABN, Publish Date - Mar 27 , 2024 | 07:16 AM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ (Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. బీహార్‌(BIHAR)లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ (Lok Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగుస్తుంది. బీహార్‌(BIHAR)లో మాత్రం నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది.

PM Modi: నువ్వో శక్తిస్వరూపిణివి.. ఓ అరాచకవాదిని జైలుకు పంపావ్‌!

తమిళనాడులో ఒకేసారి..

తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, అస్సాంలో 5, మహారాష్ట్రల్లో 5 లోక్‌సభ స్థానాల్లో ఈరోజుతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో మూడు, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మేఘాలయలో 2, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో స్థానానికి తొలి దశలో పోలింగ్ జరగనుంది. బీహార్‌లో మాత్రం నామినేషన్లను రేపటి వరకు స్వీకరిస్తారు. బీహార్ మినహా మిగిలిన ప్రాంతాల్లో రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

అగ్రనేతల ప్రచారం

మొదటి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీయే, ఇండియా కూటమిలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీయే తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఈ 102 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది.

Loksabha Polls: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన పంజాబ్ ఎంపీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 07:16 AM

Advertising
Advertising