ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: బెంగాల్‌లో అఘాయిత్యాలను బీజేపీ మాత్రమే ఆపగలదు: ప్రధాని మోదీ

ABN, Publish Date - Apr 04 , 2024 | 06:44 PM

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గల కూచ్ బిహర్‌లో గురువారం నాడు ప్రచారం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సందేశ్ ఖాళి ఘటనను ప్రధాని మోదీ ఉదహరించారు. నిందితుడిని కాపాడేందుకు దీదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని విరుచుకుపడ్డారు.

కోల్ కతా: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM Modi) బిజీగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గల కూచ్ బెహర్‌లో గురువారం నాడు ప్రచారం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సందేశ్ ఖాళి ఘటనను ప్రధాని మోదీ (PM Modi) ఉదహరించారు. నిందితుడిని కాపాడేందుకు దీదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో మహిళలపై జరిగే దారుణాలు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిలువరించగలదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని జైలుకు తరలిస్తామని తేల్చి చెప్పారు.


దీదీకి థాంక్స్

‘ముందుగా మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. 2019లో తాను ఇదే గ్రౌండ్‌కు వచ్చాను. ఆ సమయంలో గ్రౌండ్ మధ్యలో మమతా బెనర్జీ నిర్మాణం చేపట్టారు. దీదీ చేసిన పనికి ప్రజలు కచ్చితంగా సమాధానం ఇస్తారు. ఈ రోజు అలా చేయలేదు. మిమ్మల్ని అందరిని కలిసే అవకాశం కలిగింది. ఎలాంటి అడ్డంకులు సృష్టించనందుకు బెంగాల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని’ ప్రధాని మోదీ సెటైర్లు వేశారు.


కాంగ్రెస్‌పై నిప్పులు

‘దేశానికి 21వ శతాబ్దం కీలకమైంది. దేశం అభివృద్ధి చెందితే పశ్చిమ బెంగాల్ దానంతట అదే డెవలప్ అవుతోంది. పేదరికాన్ని పారదోలుతామని కాంగ్రెస్ పార్టీ ఏళ్ల నుంచి నినాదాలు ఇస్తుంది. గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి విముక్తి కలిగించాం. చిత్తశుద్దితో, నిజాయితీతో తమ ప్రభుత్వం పనిచేసింది. బెంగాల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే బీజేపీకి మంచి పేరు వస్తుందని మమతా బెనర్జీ భావించారు అని’ ప్రధాని మోదీ మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి:

Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 04 , 2024 | 07:23 PM

Advertising
Advertising