ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sugarcane Juice: మంచిదే కదా అని చెరకు రసాన్ని ఎక్కువ తాగేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!

ABN, Publish Date - May 13 , 2024 | 07:30 PM

ఎర్రటి ఎండలో గ్లాసుడు చెరకు రసం తాగితే వేసవి తాపం తీరడమే కాకుండా వడదెబ్బ లాంటివి కూడా దూరంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని కొందరు చెరకు రసాన్ని అతిగా తాగుతుంటారు. చెరకు రసాన్ని అతిగా తాగడం వల్ల జరిగేదిదే..

వేసవికాలంలో శరీర తాపం తీర్చుకోవడానికి చాలా రకాల పానీయాలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి కేవలం వేసవి తాపాన్నే కాకుండా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి. అలాంటి వాటిలో చెరకు రసం కూడా ఒకటి. ఎర్రటి ఎండలో గ్లాసుడు చెరకు రసం తాగితే వేసవి తాపం తీరడమే కాకుండా వడదెబ్బ లాంటివి కూడా దూరంగా ఉంటాయి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని కొందరు చెరకు రసాన్ని అతిగా తాగుతుంటారు. చెరకు రసాన్ని అతిగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో తెలుసుకుంటే..

చెరకు రసంలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. అయితే చెరకు రసాన్ని ఎక్కువగా తాగితే మాత్రం దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పదు.

తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!


చెరకు రసంలో పోలికోననాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది నిద్ర మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చెరకు రసాన్ని అతిగా తాగితే నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.

చెరకు రసంలో ఉండే పోలికోననాల్ అనే రసాయనం కేవలం నిద్రలేమికి మాత్రమే కాదు.. శరీరంలో రక్తం పలుచగా కావడానికి కూడా కారణం అవుతుంది. అందుకే చెరకు రసాన్ని ఎక్కువగా తాగకూడదు. మరీ ముఖ్యంగా ముందే రక్తసంబంధ సమస్యలు ఉన్నవారు చెరకు రసాన్ని ఎక్కువ తాగడం మంచిది కాదు.

చెరకు రసం దంతాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. చెరకు రసం ఎక్కువగా తాగితే దంతాలు పుచ్చులు వస్తాయి.

పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!


అదిక మొత్తంలో కేలరీలు ఉన్న ఆహారాలు ఊబకాయానికి కారణం అవుతాయనే విషయం తెలిసిందే. చెరకు రసంలో కూడా అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఈ కారణంగా చెరకు రసాన్ని ఎక్కువగా తీసుకుంటే ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి.

చెరకు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. సైనస్, అలెర్జీలు ఉన్నవారు చెరకు రసాన్ని చల్లని సమయాలలోనూ, ఐస్ ముక్కలు కలిపి తీసుకోవడం వల్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు కేలరీలు, చక్కెర శాతం అధికంగా ఉన్న ఆహారాలు, పానీయాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. అలాంటి వాటిలో చెరకు రసం కూడా ఉంది. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం మూలానా మధుమేహం ఉన్నవారు చెరకు రసం తీసుకోకూడదు.

పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!

తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇదిగో ఇవే అతిపెద్ద 6 కారణాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 13 , 2024 | 07:30 PM

Advertising
Advertising