పుచ్చకాయ ఎక్కువగా తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు..!

వేసవిలో అందుబాటులోకి వచ్చే పుచ్చకాయ అంటే చాలామందికి ఇష్టం. శరీర తాపం తీరుతుందని దీన్ని అదేపనిగా తినేవాళ్లు ఉంటారు. అయితే పుచ్చకాయ అతిగా తింటే కొన్ని నష్టాలు తప్పనవని ఆహార నిపుణులు అంటున్నారు.

పుచ్చకాయలో కేలరీలుతక్కువే అయినా అధిక తీపి ఉంటుంది. ఈ కారణంగా పుచ్చకాయ ఎక్కువ తింటే కేలరీలు ఎక్కువగా శరీరంలోకి వెళ్లి ఆరోగ్యకమైనది కాస్తా బరువు పెరగడానికి కారణం అవుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు పుచ్చకాయ ఎక్కువ తినడం వల్ల వస్తాయి.

పుచ్చకాయను మధుమేహం ఉన్నవారు కూడా మితంగా తీసుకోవచ్చు. అయితే దీన్ని అధికంగా తీసుకుంటే మాత్రం మధుమేహ రోగులకు ప్రమాదం.

శరీరానికి ఖనిజాలు కూడా ముఖ్యమే. అయితే పుచ్చకాయ అధికంగా తినడం వల్ల శరీరంలో ఖనిజాలు విచ్చిన్నమవుతాయి. ఇది చాలా ప్రమాదం.

ఉదర సంబంధ వ్యాధులతో బాధపడేవారు పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.