నిద్ర సరిగ్గా లేకపోతే.. ఇక అంతే

కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండాలనేది మనకు తెలిసిందే. బిజీ లైఫ్‌లో అనేక కారణాల వల్ల నిద్ర కరవవుతోంది. నిద్రలేకపోతే ఏమవుతుందంటే.. 

చిరాకుగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. పగటిపూట నిస్సత్తువ ఆవరిస్తుంది. శరీర పనితీరు మందగించి, నీరసంగా మారిపోతారు.

నిద్ర లేమి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అణచివేస్తుంది. 

బరువు పెరుగుతారు. ఊబకాయానికి దారితీస్తుంది.

ఏకాగ్రత కోల్పోతారు. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.

రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. 

జీర్ణక్రియ దెబ్బతింటుంది. తిన్న ఆహారం అరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కాబట్టి మంచిగా నిద్ర పోవడం చాలా అవసరం.