ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips: భోజనానికి ముందు లేదా తరువాత కాఫీ, టీ తాగే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు మీకోసమే..!

ABN, Publish Date - May 27 , 2024 | 03:56 PM

కొందరికి టిఫిన్, భోజనం ముందు లేదా తరువాత కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా కాఫీ, టీ లను తీసుకునేవారికి బిగ్ అలర్ట్ ఇచ్చారు ఆహార నిపుణులు. భోజనానికి ముందు, తరువాత కాఫీ, టీలను తీసుకోవడం గురించి వారు చెప్పిన షాకింగ్ నిజాలివీ..

కాఫీ, టీ చాలామందికి ఇష్టమైన పానీయం. వీటిలో ఏదో ఒకదానితో రోజు మొదలవుతుంది. రోజులో పలు సందర్భాలలో కాఫీ, టీ తాగడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొందరికి టిఫిన్, భోజనం ముందు లేదా తరువాత కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా కాఫీ, టీ లను తీసుకునేవారికి బిగ్ అలర్ట్ ఇచ్చారు ఆహార నిపుణులు. భోజనానికి ముందు, తరువాత కాఫీ, టీలను తీసుకోవడం మంచిది కాదని, రోజులో కాఫీ, టీలు ఎంత మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో కుడా ఆహార నిపుణులు వివరించారు. ఆ విషయాలు తెలుసుకుంటే..

టీ, కాఫీలు భోజనానికి ముందు లేదా తరువాత తీసుకోవడం మంచిది కాదు. దీని వెనుక కారణం గురించి ఆహార నిపుణులు వివరించారు. కాఫీ, టీ లలో కెఫీన్ ఉంటుంది. భోజనానికి ముందు లేదా తరువాత కెఫీన్ పానీయాలు తీసుకుంటే శరీరం ఐరన్ ను గ్రహించడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఐరన్ ఆధారిత ఆహారాలు తీసుకున్నా అవి శరీరానికి అందవు.

ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!


రోజులో ఎంత కాపీ, టీ తాగాలి?

రోజులో 300మి.గ్రా కెఫిన్ా తీసుకోవచ్చు. 150మిల్లీ ల కాఫీలో 80 నుండి 120మి.గ్రా కెఫిన్ ఉంటుంది. ఇన్స్టంట్ కాఫీలో 50-60 మి.గ్రా కెఫీన్ ఉంటుంది. ఇక టీలో ఒక్కో కప్పు టీలో 30 నుండి 65మి.గ్రా ల కెఫీన్ ఉంటుంది. దీన్ని బట్టి కాఫీ, టీ తీసుకోవాలి.

ఏ సమయాల్లో తీసుకోవచ్చు.. తీసుకోకూడదు..

టీ, కాఫీలలో టానిన్లు ఉంటాయి. ఇవి ఆమ్లంగా ఉంటాయి. ఇప్పటికే ఎసిడిటీతో బాధపడేవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీ తీసుకుంటే ఈ సమస్య మరింత అధికం అవుతుంది. యాసిడ్ విడుదలను ప్రేరేపిస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది.

కాఫీ, టీలలో కెఫీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిద్రకు ముందు కాఫీ, టీలు తీసుకోకూడదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నిద్రకు నాలుగు నుండి ఆరు గంటలలోపు కాఫీ, టీ లు ముగించాలి.

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..


కాఫీ, టీ లను అతిగా ఉడకబెట్టడం వల్ల టీ ఆకుల నుండి టానిన్లు రిలీజ్ అవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలను ప్రేరేపిస్తాయి.

రోజులో నాలుగు నుండి ఐదు కప్పుల కంటే ఎక్కువ కాఫీ, టీ తీసుకోవడం మంచిది కాదు. అలాగే కెఫీన్ వల్ల శరీరం స్పందించే తీరును బట్టి ఇది నిర్ణయించబడుతుంది.

పాలతో తయారుచేసే టీ కాకుండా బ్లాక్ టీని తీసుకోవడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఇది గుండె జబ్బులు, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం, మెరుగైన రక్తప్రసరణ వంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. అయితే దీన్ని కూడా మితంగానే తీసుకోవాలి.

ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 27 , 2024 | 03:56 PM

Advertising
Advertising