ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!

ధ్యానం మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. చాలామంది ధ్యానం చెయ్యాలనుకుని విఫలం అవుతుంటారు.  అయితే సులువుగా ధ్యానం చెయ్యడానికి కొన్ని మార్గాలున్నాయి.

ధ్యానంలో లీనమవడం కోసం కొందరు సంగీతం, ఓంకారం, వర్షం, సముద్రం ఇలాంటి శబ్దాలను వింటూ ఉంటారు. ఇవి ధ్యానానికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తాయి.

ఇప్పట్లో ధ్యానం చేసే చాలామంది గైడెడ్ మెడిటేషన్ ప్రయత్నిస్తుంటారు. ధ్యాన శిక్షకులు ధ్యాన ప్రక్రియను వివరించడం ద్వారా  ధ్యానంలో లీనమయ్యేలా చేస్తారు. ఇది ఆన్లైన్, ఆఫ్ లైన్ రెండువిధాలా అందుబాటులో ఉంటుంది.

ధ్యానం చేసే సెషన్ ను చిన్నగా ఉండేలా చూసుకోవాలి.  ఎక్కువ టైం ధ్యానంలో కూర్చోవడం చాలామందికి బోర్ గా అనిపించవచ్చు.

ప్రోత్సహించేవారు పక్కనుంటే ఏదైనా సాధ్యమే. ధ్యానం చేసే వారితో స్నేహం చెయ్యడం ద్వారా స్నేహితులతో కలిసి ధ్యానం చేయవచ్చు. దీని వల్ల ఒకరికొకరు సహకరించుకోవడం సులువు అవుతుంది.

ధ్యానం చేసేటప్పుడు ధ్యానానికి సంబంధించిన విషయాలను ఊహించుకోవడం ద్వారా మనసును ధ్యానం మీద కేంద్రీకరించడం సులువు అవుతుంది.