మార్నింగ్ లేచిన వెంటనే నీరు తాగడం మంచిదేనా..నిపుణులు ఏమన్నారంటే

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి

వాటిలో ఒకటి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడమని నిపుణులు చెబుతున్నారు

మార్నింగ్ లేచిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు

దీంతో శరీరంలో పేరుకుపోయిన మలినాలు సులభంగా తొలగిపోతాయని అంటున్నారు

ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగే వారిలో కిడ్నీ రాళ్ల సమస్యలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు

రోగనిరోధక శక్తిని పెంచడానికి మనం ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలని సూచిస్తున్నారు

నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకముందే నీరు తాగటం అలవాటు చేసుకోవాలని అంటున్నారు

ఆ క్రమంలో నిద్ర లేవగానే కనీసం 2 నుంచి 3 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు

నీరు తాగిన అరగంట వరకు కూడా ఏమి తినకూడదని నిపుణులు చెబుతున్నారు