వీటిని తింటే చాలు.. మెదడు వేగంగా కంప్యూటర్ లా పనిచేస్తుంది..!

పచ్చని ఆకుకూరలు.. క్యాబేజీ, పాలకూర, క్యాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

కాఫీ.. కాఫీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

పాల ఉత్పత్తులు.. ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు చేర్చుకోవాలి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని  మెరుగ్గా ఉంచుతాయి.

చియా విత్తనాలు.. రెగ్యులర్ డైట్ లో చియా సీడ్స్ ను చేర్చుకోవడం చాలా అవసరం. మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు చియా విత్తనాలలో ఉంటాయి.

డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, మెదడు పనితీరు పెంచడంలోనూ సహాయపడుతుంది.

బ్రోకలీ.. మెదడు పనితీరు మెరుగుపరుచుకోవాలంటే బ్రోకలిని తినవచ్చు.

దానిమ్మ.. రోజూ దానిమ్మ పండు తింటూ ఉంటే రక్తం మెరుగు పడటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

డేట్స్.. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.