షుగర్ ఉన్న వారికి ఈ పళ్లు ఎంతో మేలు చేస్తాయి..!

బెర్రీస్ బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇతర బెర్రీ ఫలాలు డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచి చేస్తాయి. వీటిలోని యాంటీ-యాక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి అవసరమైన పోషకాలు అందిస్తాయి. 

టార్ట్ చెర్రీస్ టార్ట్ చెర్రీ పండులో కేవలం 12.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

పీచెస్ పీచ్ ఫలాల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంలో పీచెస్ బాగా పని చేస్తాయి. అలాగే సీ విటమిన్ కూడా తగినంత ఉంటుంది. 

ఆప్రికాట్స్ ఆప్రికాట్స్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే విటమిన్-ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

ఆపిల్స్ ఆపిల్స్‌లో విటమిన్-సి, ఫైబర్, గుండెకు రక్షణ కల్పించే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీలైనప్పుడల్లా షుగర్ వ్యాధిగ్రస్తులు ఆపిల్స్ తినాలి. 

ఆరెంజ్ ఒక ఆరెంజ్‌లో 63 ఎమ్‌జీ విటమిన్-సి, ఫొలేట్, పాస్పేట్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలుంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. 

పీర్స్ షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పక తినాల్సిన మరో పండు పీర్స్. దీనిలోని ఫైబర్, పలు రకాల విటమిన్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 

కివీ ఈ గ్రీన్ ఫ్రూట్ విటమిన్-సి, ఫైబర్, పొటాషియంలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్.