మామిడి పండ్లను ఎలా తినాలి.. ఒక రోజు ఎన్ని తినొచ్చు

మామిడి తినడానికి ముందు దానిని నీటి పాత్రలో కనీసం 2 నుంచి 4 గంటలు ఉంచిన తర్వాత మాత్రమే తినాలి

ఇలా చేయడం వల్ల మామిడిలో ఉండే వేడి ప్రభావం తగ్గుతుంది

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం లేదా సాయంత్రం అల్పాహారం సమయంలో మామిడిపండు తినడం ఉత్తమం

లంచ్ లేదా డిన్నర్ తర్వాత దీన్ని తినకూడదు. ఇది అజీర్ణానికి కారణమవుతుంది

నిద్రపోయే ముందు మామిడి తినడం మానుకోవాలి

మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారు మామిడిపండు తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి

ఆరోగ్యకరమైన పెద్దలు రోజుకు ఒక మామిడిని తినవచ్చు

100 గ్రాముల మామిడిలో దాదాపు 60 కేలరీలు ఉండగా, ఒక మామిడిలో దాదాపు 202 కేలరీలు ఉంటాయి

మామిడిని బాదం, వాల్‌నట్‌లు, వేయించిన శనగలు, మఖానాతో కలిపి తినవచ్చు

కొందరికి మామిడికాయలంటే పిచ్చి ఉంటుంది. అలాంటి వారు రోజుకి 1 నుంచి 2 తీసుకోవచ్చు