ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: చోరీ చేసిన వాహనాలతో విన్యాసాలు.. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు

ABN, Publish Date - Apr 17 , 2024 | 12:26 PM

వాహనాలతో విన్యాసాలు చేసి ఫేమస్‌ కావాలనుకున్నారు.. పలు రకాల వాహనాలతో విన్యాసాలు చేసి.. వాటిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్‌ చేశారు.

- ఇద్దరి అరెస్ట్‌.. 9 ద్విచక్రవాహనాలు స్వాధీనం

హైదరాబాద్: వాహనాలతో విన్యాసాలు చేసి ఫేమస్‌ కావాలనుకున్నారు.. పలు రకాల వాహనాలతో విన్యాసాలు చేసి.. వాటిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో పోస్ట్‌ చేశారు. వీరు విన్యాసాలు చేసిన వాహనాలు చోరీ చేసినవని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి తొమ్మిది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బేగంపేట పోలీస్‏స్టేషన్‌(Begumpet Police Station)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్‌జోన్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ గోపాల కృష్ణమూర్తి, ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, డీఐ మల్లేష్ తో కలిసి వివరాలు వెల్లడించారు.

ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు 10.. బీజేపీకి 5

చాంద్రాయణగుట్ట షాహీన్‌నగర్‌కు చెందిన షేక్‌ ఇబ్రహీం(19), బేగంపేట ప్రాంతానికి చెందిన బాలుడు నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్నారు. దొంగిలించిన వాహనాల నంబరు ప్లేట్లను తొలగించి షాహీన్‌నగర్‌ శివారు ప్రాంతాల్లో విన్యాసాలు చేసేవారు. విన్యాసాలను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపులలో పోస్టు చేస్తుండేవారు. బేగంపేటలో తన వాహనాం చోరీ అయిందని స్మితాపటేల్‌ ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చోరీ అయిన వాహనాలను షాహీన్‌నగర్‌లో నంబరు ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయని గుర్తించారు. అడ్మిన్‌ ఎస్‌ఐ గంగాధర్‌ నేతృత్వంలో క్రైం పోలీసులు షాహీన్‌నగర్‌ వెళ్లి వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులు షేక్‌ ఇబ్రహీం, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. వాహనాలను చోరీచేసి వాటి మీద విన్యాసాలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సా్‌పలో పోస్ట్‌ చేసి ఫేమస్‌ కావాలనుకున్నామని పోలీసులకు తెలిపారు. ఎస్సార్‌నగర్‌, సనత్‌నగర్‌, హుమాయున్‌నగర్‌, రాంగోపాల్‌పేట, ఫిలింనగర్‌ పోలీస్‏స్టేషన్ల పరిధుల్లో వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదికూడా చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ యువత

Updated Date - Apr 17 , 2024 | 12:26 PM

Advertising
Advertising