Share News

కాంగ్రెస్‌కు 10.. బీజేపీకి 5

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:58 AM

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో అధికారపక్షం కాంగ్రెస్‌ 42 శాతం ఓట్లతో 10 సీట్లను కైవసం చేసుకుంటుందని ఏబీపీ న్యూస్‌-సీ ఓటర్‌ తాజా ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. మంగళవారం ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం.. ఓట్ల పరంగా 27

కాంగ్రెస్‌కు 10.. బీజేపీకి 5

ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్నా

బీఆర్‌ఎ్‌సకు దక్కేది ఒక్క సీటే

తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్‌-

సీ ఓటర్‌ ఒపీనియన్‌ పోల్‌

ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం

25 లోక్‌సభ స్థానాల్లో 20 కూటమికే!

5 సీట్లకే పరిమితం కానున్న వైసీపీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో అధికారపక్షం కాంగ్రెస్‌ 42 శాతం ఓట్లతో 10 సీట్లను కైవసం చేసుకుంటుందని ఏబీపీ న్యూస్‌-సీ ఓటర్‌ తాజా ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. మంగళవారం ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం.. ఓట్ల పరంగా 27 శాతం వాటాతో కాంగ్రెస్‌ తర్వాత రెండో స్థానంలో ఉండే బీఆర్‌ఎస్‌ కేవలం ఒక్క సీటుకే పరిమితమవుతుంది. 26 శాతం ఓట్లను సాధించే బీజేపీ ఏకంగా ఐదు సీట్లను గెల్చుకుంటుందని, మజ్లిస్‌ తనకున్న ఒక స్థానాన్ని నిలుపుకొంటుందని ఈ సర్వే అంచనా వేసింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని, ఆ రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లకుగాను ఈ కూటమి 20 సీట్లలో విజయ కేతనం ఎగురవేయనుందని ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే వెల్లడించింది. అధికారపక్షం వైఎస్సార్‌సీపీ కేవలం ఐదు సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. టీడీపీ కూటమిలో పార్టీల వారీగా చూస్తే టీడీపీ, జనసేన కలిపి 15 సీట్లను కైవసం చేసుకుంటాయని, బీజేపీ ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ఓట్ల పరంగా టీడీపీ కూటమి 46.7 శాతం ఓట్లను, వైసీపీ 39.9ు ఓట్లను సాధిస్తాయని తెలిపింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం తథ్యమని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోంది.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్‌

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. వీటి ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ 8, బీజేపీ 6, బీఆర్‌ఎస్‌ 2, ఎంఐఎం ఒక స్థానాన్ని గెల్చుకోనున్నాయి. ఏపీలో టీడీపీ 12, బీజేపీ 3, వైసీపీ 10 స్థానాలను కైవసం చేసుకుంటాయి. ఏపీలో కాంగ్రెస్‌ ఖాతా తెరవబోదని ఈ సర్వే పేర్కొంది. కాగా, దేశంలో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టించనుందని, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 393 సీట్లతో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేయనుందని, ఇండియా కూటమి 100 సీట్లను మించి సాధించలేదని సర్వే వెల్లడించింది.

Updated Date - Apr 17 , 2024 | 03:58 AM