ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే

ABN, Publish Date - Apr 10 , 2024 | 04:01 PM

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) రూల్స్(rules) మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాలి.

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) రూల్స్(rules) మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగం మారే సమయంలో PF డబ్బును బదిలీ చేయడానికి ఒక ఫారమ్‌ను నింపి సమర్పించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఉద్యోగం మారితే, PF ఆటోమేటిక్‌గా ప్రస్తుత కంపెనీకి బదిలీ చేయబడుతుంది.


మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం EPF సేవింగ్స్ స్కీమ్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ పథకం ప్రకారం ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ ఈ పథకానికి సమానంగా విరాళం ఇవ్వాలి. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగి తన సహకారం, కంపెనీ సహకారం రెండు మొత్తాలపై వడ్డీని కలిపి ఈ డబ్బును పొందుతాడు. అయితే వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్‌పై లెక్కించబడుతుంది.

అయితే ముప్పై ఆరు నెలల పాటు నిరంతరంగా EPF ఖాతాలో మీరు విరాళం అందించకపోతే, ఖాతా నిష్క్రియాత్మకంగా పనిచేయకుండా మారిపోతుంది. రిటైర్డ్ ఉద్యోగుల ఇన్ ఆపరేటివ్ ఖాతాల్లో జమ చేసిన మొత్తానికి వడ్డీ అందించబడదు. ప్రతి నెలా మీ EPF ఖాతాకు వడ్డీ జమ అవుతుంది. కానీ మీరు దానిని ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన మాత్రమే చూస్తారు. మీరు పదవీ విరమణ చేసే సమయంలో మీరు పెట్టిన డబ్బు మొత్తం, అదనంగా వడ్డీతోపాటు మొత్తం తిరిగి పొందవచ్చు.


ఇది కూడా చదవండి:

యూనికార్న్‌లలో భారత్‌ నం.3

గ్లాండ్‌ ఫార్మాలో రూ.1,411 కోట్ల బ్లాక్‌ డీల్‌


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 04:03 PM

Advertising
Advertising