ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Personal Loans: పర్సనల్ లోన్స్ వీటి కోసం అస్సలు తీసుకోవద్దు.. ఎందుకంటే!

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:24 AM

పర్సనల్ లోన్స్(personal loans) వీటిని అనేక మంది ఉద్యోగులు ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా లోన్స్ అవసరమైనప్పుడు మొదట బ్యాంకు వైపు చూస్తారు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తాయి. కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

do not take personal loans

పర్సనల్ లోన్స్(personal loans) వీటిని అనేక మంది ఉద్యోగులు ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా లోన్స్ అవసరమైనప్పుడు మొదట బ్యాంకు వైపు చూస్తారు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తాయి. సులభమైన మార్గం ఏమిటంటే బ్యాంక్ మీ నుంచి ఎలాంటి పూచికత్తు గురించి ఆడగదు. కానీ మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, శాలరీ వంటి పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుని బ్యాంకులు(banks) మీకు త్వరగా వ్యక్తిగత రుణాన్ని అందిస్తాయి. అయితే క్లిష్టపరిస్థితుల్లోనే ఈ రుణం(loan) తీసుకున్నామని అనేక మంది చెబుతుంటారు. కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


ఎందుకంటే బ్యాంకులు పర్సనల్ లోన్‌లపై అధిక వడ్డీ రేట్లను(interest rate) వసూలు చేస్తాయి. మీరు లోన్ తీసుకునే ముందు చెప్పిన వడ్డీ రేటుకు, మీకు లోన్ తీసుకున్న తర్వాత ఉన్న వడ్డీ రేటుకు మార్పు ఉంటుంది. దీనిని గమనించాలి. అంతేకాదు కొంత మంది పర్సనల్ లోన్స్‌కు తక్కువ వడ్డీ రేట్ ఉంటుందని, దీన్ని తీసుకుని షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని సూచనలు చేస్తారు. అలా చేయడం ద్వారా మీరు భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రుణం తీసుకుని పెట్టుబడి పెట్టడం వంటి సలహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


మరోవైపు ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు వాటి కోసం రుణం(loan) తీసుకోకూడదు. లేకుంటే మీరు దాని కోసం ఎక్కువ వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఖరీదైన వస్తువుల కోసం తహతహలాడడం వల్ల మీ ఖర్చు మరింత పెరుగుతుంది. ఇది మీ అలవాటుగా మారితే మీరు ఎక్కువ రుణాలు తీసుకుని అప్పుల ఊబీలో చిక్కుకుంటారు. ఇంకోవైపు తరచుగా అనేక మంది వారు రుణాన్ని తిరిగి చెల్లించవలసి వస్తే ఆ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరొక రుణాన్ని తీసుకుంటారు. కానీ ఇలాంటి తప్పు చేయోద్దు. మీరు ఒక రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరొక రుణం తీసుకుంటే, మీ రుణం అప్పు భారం మరింత పెరుగుతుంది. కానీ అధిక వడ్డీ రేటు రుణాలను తక్కువ వడ్డీ రేటు లోన్స్(low interest personal loans) ద్వారా చెల్లించవచ్చు.


లాటరీ(lottery), జూదం, ఇతర పెట్టుబడుల కోసం కూడా లోన్స్ తీసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీకు వచ్చే రాబడి కంటే మీరు చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పర్సనల్ లోన్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా అని మొత్తానికే ఇవి తీసుకోవద్దని కాదు, కానీ ఒకటి రెండు కంటే ఎక్కువ లోన్స్ ఉంటే ఆర్థిక భారం పెరిగి ఇబ్బందులకు లోనవుతారు.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 18 , 2024 | 11:50 AM

Advertising
Advertising