ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kadapa Politics: వైయస్ అవినాశ్ రెడ్డి ఓటమి ఖాయమా?

ABN, Publish Date - Apr 21 , 2024 | 07:53 PM

రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది.

YS Avinash Reddy

రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలాగే ఆయన సోదరుడు, కడప ఎంపీ వైయస్ అవినాష్‌ రెడ్డికి సైతం ఆయన సొంత నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఓ చర్చ ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది. వైయస్ జగన్.. ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నగదు పంచారు. అంతేకానీ అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడ కానరాలేదని సర్వత్రా వినిపిస్తోంది. ఇక వైయస్ అవినాష్ రెడ్డి సైతం వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

AP Elections: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

అయితే ఉమ్మడి కడప జిల్లావ్యాప్తంగా వివేకాకు మంచి పేరు ఉంది. గతంలో కడప ఎంపీగా వైయస్ రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. ఆ విజయంలో తెర వెనుక పాత్ర వైయస్ వివేకాదేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు వైయస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌లో ఉన్నా.. జిల్లా రాజకీయమంతా వివేకా గుప్పిట్లోనే ఉండేదన్న ప్రచారం నేటికీ జిల్లావ్యాప్తంగా ఉంది. అలాంటి వివేకాను ఆయన రక్తసంబంధికులే అత్యంత దారుణంగా హత్య చేశారనే విషయంపై జిల్లా వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు వినిపిస్తోంది.

Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు


మరోవైపు పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సైతం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో వైయస్ వివేకా హత్య కేసులో నిందితులకే కాదు.. ఈ నిందితులకు అండ.. దండగా ఉన్న వైయస్ జగన్‌కు సైతం ఓటు వేయ్యవద్దంటూ ప్రజలకు వీరిద్దరూ సూచిస్తున్నారు. మరోవైపు వైయస్ షర్మిల, సునీత నర్రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో పావులంటూ వైయస్ జగన్ అండ్ కో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

ఒకవేళ అదే నిజమనుకుంటే వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్‌రెడ్డిని తొలిసారి సీబీఐ విచారణకు హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు.. అతడి వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని జిల్లాలో ఓ చర్చ అయితే నేటికి వాడీవేడిగా వైరల్ అవుతుంది.


పోనీ చంద్రబాబు చేతిలో షర్మిల, సునీత పావులనే అనుకుందాం. మరి అధికారంలో ఉన్న వైయస్ జగన్.. వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదనే ఓ వాదన జిల్లా ప్రజల్లో బలంగా నలుగుతుంది.

Bihar: కు.ని ఆపరేషన్ చేసిన కాంపౌండర్: చనిపోయిన మహిళ

అదీకాక వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట జగన్ కేబినెట్‌లోని పలువురు మంత్రులే కాదు.. ఆయన అనుచరగణం కూడా భాగ్యనగరానికి తరలి వచ్చింది. ఇక అదే రోజు సీఎం వైయస్ జగన్.. తన అధికార పర్యటనలన్నీ రద్దు చేసుకుని తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారనే ఓ చర్చ సైతం జిల్లాలో సాగుతుంది. అందుకే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదని ఓ ప్రచారం సాగుతోంది.


AP Elections: నామినేషన్ వేయనున్న చింతమనేని

మరోవైపు కడప జిల్లాలో వైయస్ షర్మిల ప్రచారానికి ప్రజలు పోటెత్తుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన వైయస్ షర్మిల చేతిలో అవినాష్ ఓటమి తప్పదనే ఓ ప్రచారం అయితే వాడి వేడిగా సాగుతుంది. దీంతో గతంలో వైయస్ వివేకా.. కన్న కల రేపు ఎన్నికల వేళ సాకారమవుతుందని జిల్లా వాసులు జోస్యం చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 21 , 2024 | 07:54 PM

Advertising
Advertising