Share News

AP Elections: నామినేషన్ వేయనున్న చింతమనేని

ABN , Publish Date - Apr 21 , 2024 | 07:37 PM

తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడి ఉందని తెలుస్తోంది. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించారు.

AP Elections: నామినేషన్ వేయనున్న చింతమనేని
chintamaneni prabhakar

అమరావతి, ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడి ఉందని తెలుస్తోంది. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించారు.

AP Elections: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

దీంతో దెందులూరుపై టీడీపీలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే దెందులూరులో చింతమనేనికి బి ఫారమ్ ఇవ్వాలని ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తుంది.

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్


ఈ రోజు చింతమేనేనికి బి ఫారమ్ ఇవ్వకపోవడంతో కొంత ఉత్కంఠత నెలకొంది. అయితే దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక తంబళ్లపల్లెలో జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. కానీ సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయి.

Bihar: కు.ని ఆపరేషన్ చేసిన కాంపౌండర్: చనిపోయిన మహిళ

ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో ఇక ఈ అసెంబ్లీ స్థానం నుంచి సరళారెడ్డి లేదా శంకర్ యాదవ్‌లల్లో ఒకరికి అవకాశం ఇచ్చే అంశంపై పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై సోమవారం ఉదయం ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..

Updated Date - Apr 21 , 2024 | 07:37 PM