ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vangalapudi Anitha: ఇప్పటికి వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుంది..

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:11 AM

సింహాచలం అప్పన్నను రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనిత దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఘనంగా ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం వంటివి ఇచ్చారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్నారు.

విశాఖ: సింహాచలం అప్పన్నను రాష్ట్ర హోమ్ మంత్రి వంగల పూడి అనిత దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఘనంగా ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేదాశీర్వచనం వంటివి ఇచ్చారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్నారు. వైపీనీ హయాంలో కొంతమంది పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహారించారన్నారు. ఇప్పటికి వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగానే వ్యవహారిస్తున్నారన్నారు.


మీకు ఇంకా జగన్ పై ప్రేమవుంటే, ఉద్యోగానికి రాజీనామాలు చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని అనిత సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పుచేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని.. అవసరమైతే వారి తరపున పోరాడుతానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కూడా త్వరలో జరుగుతుందని అనిత తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 11:11 AM

Advertising
Advertising