Nara Lokesh: త్వరలో నూతన ఐటీ పాలసీ
ABN, Publish Date - Jun 15 , 2024 | 09:59 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రులు క్రమంగా తమ శాఖలవారీగా సమీక్షలు చేస్తున్నారు. యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేశ్ అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే అంశంపై అధికారులను ఆరా తీశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు క్రమంగా తమ శాఖలవారీగా సమీక్షలు చేస్తున్నారు. యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై మంత్రి లోకేశ్ అధికారులతో రివ్యూ చేశారు. రాష్ట్రంలో త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేశ్ ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే అంశంపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటికే ఉన్న ఐటీ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలు, ఇతర వివరాలను ఆరా తీశారు. వీలైనంత త్వరగా వివరాలు సమర్పిస్తే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో నూతన పాలసీ తీసుకొస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అదేవిధంగా విశాఖపట్టణాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన చేశారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరుగాంచిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని వివరించారు.
Updated Date - Jun 15 , 2024 | 09:59 PM