Nara Lokesh: ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్
ABN, Publish Date - Feb 17 , 2024 | 05:26 PM
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు విశాఖ పెందుర్తి నియోజకవర్గం, పురుషోత్తపురంలో, శంఖారావం సభ నిర్వహించారు.
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. శనివారం నాడు విశాఖ పెందుర్తి నియోజకవర్గం, పురుషోత్తపురంలో, శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభల్లో నారా లోకేష్ ప్రసంగించారు. ఏపీకి రాజధాని పేరుతో జగన్ మూడు ముక్కలాటలాడారని మండిపడ్డారు. విశాఖ రాజధాని అంటూ వేల కోట్ల భూములు కొట్టేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రాను మూడు కుటుంబాలు అవినీతి మయంగా చేశారని.. వాటిలో ఒకటి మంత్రి బొత్స సత్యనారాయణ. రెండు విజయసాయిరెడ్డి, మూడు వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలని చెప్పారు.. వీళ్లంతా ఎక్కడ భూములు దొరికినా, గనులు దొరికినా దోచేస్తారని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను టీడీపీ కాపాడుకుంటుందని చెప్పారు. విశాఖకు ఇచ్చిన ఏ హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విశాఖలో ఉన్న భూములను సైతం కబ్జా చేస్తున్నారని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తానన్నాడని.. ఇంతవరకు ఈ పని కూడా జగన్ చేయలేదని చెప్పారు. యువతకు ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పోయే పరిస్థితికి తీసుకొచ్చాడని ధ్వజమెత్తారు. రుషికొండలో రూ. 500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన తనయుడు కలిసి బాక్సైట్, లాటరైట్ దోచేస్తున్నారని.. అలాగే యూజీసీ సొమ్మును సైతం వాడేశారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 17 , 2024 | 11:03 PM